కొవిడ్ నెగటివ్ నకిలీ రిపోర్ట్‌లను విక్రయిస్తున్న 2 ముఠాలు ఆరెస్ట్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కరోనా నెగటివ్ నకిలీ రిపోర్టులు, నకిలీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లను విక్రయిస్తున్న రెండు ముఠాలను సైబరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరెస్టు చేశారు. కొవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోకపోయినా నెగిటివ్ రిపోర్ట్ లను తయారుచేసి విక్రయిస్తున్నారు. అదేవిధంగా రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకోకపోయినా నకిలీ ధ్రవపత్రాలు తయారు చేసి సొమ్ముచేసుకుంటున్నారని టాస్క్ ఫోర్స్ డిసిపి వెల్లడించారు. . ఇలాంటి నకిలీ సర్టిఫికెట్‌లకు రూ. 2వేనుండి రూ. 3వేల వరకు వసూలు చేస్తున్నారు. వారి వద్దనుండి 65 నకిలీ కొవడ్ నెగిటివ్ సర్టిఫికెట్‌లు, 20 శాంపిల్ కలెక్షన్ కిట్స్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.