విశాఖ: 2 కేజీల బంగారం, 287 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగింత

విశాఖ (CLiC2NEWS): సెప్టెంబర్లో జరిగిన చోరీలకు సంబంధించిన మొత్తం రికవరీ చేసి బాధితులకు పోలీసులు అప్పగించారు. మొత్తం 73 మంది నిందితులను అదుపులోకి తీసుకొని, రూ. 44 లక్షల విలువైన 287 సెల్ఫోన్లు, 2.2 కేజీల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు పోలీస్ కమిషన్ వెల్లడించారు. గతంలో రికవరీ చేసిన వస్తువులను ఫిర్యాదు దారులకు తిరిగి ఇవ్వడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు ఉండేవని.. ఇపుడు ప్రభుత్వ చొరవతో ఫిర్యాదు దారులకు వాటిని వెంటనే అందించే వీలు కలుగుతోందని తెలిపారు.