మంచిర్యాల: 20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు సీజ్
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): మంచిర్యాల జిల్లా నేన్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పారం గ్రామం లో శనివారం టాస్క్ ఫోర్స్ఏ పోలీసులు 20 కిలోల నకిలి పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నారా పురుషోత్తం పొలం దగ్గరు నకిలీ విత్తనాలను నిల్వ ఉంచి.. ఇంటికి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేశారు. నేన్నాల్ బస్ స్టాండ్ 20 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు దొరికినవి . వాటిని స్వాధీన పరుచుకొని నేన్నాల్ పోలీస్ స్టేషన్ తరలించారు.
రైతులను మోసం చేయాలని ఉద్దేశ్యం తో నకిలీ విడి పత్తి విత్తనాలు ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు అమ్మినా.. వారి మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడును. రైతులు ఎవరు కూడా నకిలీ విడి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు అని తెలియచేశారు .