TS: గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే వస్తు ప్రదర్శన

హైదరాబాద్ (CLiC2NEWS) :తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ నెల 8వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనుల జీవన వైవిధ్యాన్ని తెలిపే వస్తు ప్రదర్శనను నగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈనెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంతో గిరిజన సంక్షేమ శాఖా కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తు, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, సంయుక్త సంచాలకులు సముజ్వల,అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.