2036 వరకూ రష్యా అధ్యక్షుడు పుతినే?

మాస్కో : వ్లాదిమిర్ పుతిన్ తన జీవితకాలంలో మ‌రో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అనుమతించే ఒక చట్టంపై సంతకం చేశారు. ఈ చ‌ట్టంతో 2036 వరకూ ఆయనను పదవిలో ఉంచే అవకాశం ఉంది. మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు వీలు కల్పించే ఒక చట్టంపై వ్లాదిమిర్‌ పుతిన్‌ సోమవారం లాంఛనంగా సంతకం చేశారు.

68 ఏళ్ల పుతిన్‌.. రెండు దశాబ్దాలకుపైగా రష్యాలో అధికారంలో ఉన్నారు. సోవియట్‌ పాలకుడు జోసెఫ్‌ స్టాలిన్‌ కన్నా ఎక్కువకాలం పాటు పుతిన్‌ పదవిలో కొనసాగారు. ఆయన ప్రస్తుత ఆరేళ్ల పదవీకాలం 2024 లో ముగియనుంది. మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలా? వద్దా? అనేది తరువాత నిర్ణయిస్తానని పుతిన్‌ చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.