పండుగ వేళ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 21 టిక్కెట్ కౌంటర్లు

హైదరాబాద్ (CLiC2NEWS): పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్యరైల్వే సికింద్రాబాద్ స్టేషన్లో 21 టికెట్ కౌంటర్లను ప్రారంభించింది. సాధారంణంగా మామూలు రోజుల్లో 12 కౌంటర్లు మాత్రమే ఉంటాయి. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అదనపు సిబ్బందిని నియమించామని దక్షిణ మధ్యరైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేష్ తెలిపారు. టికెట్ తనిఖీ సిబ్బందిని కూడా 20 నుండి 40 మందికి పెంచారు. 13,14 తేదీల్లో పలు ఎమ్ ఎమ్‌టిఎస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఫలక్‌నమా-లింగంపల్లి-ఫలక్‌నమా మధ్య 11 సర్వీసులను, హైదరాబాద్-ఫలక్‌నమా-హైదరాబాద్ మధ్య ఒక రైలు సర్వీసును, లింగంపల్లి-హైదరాబాద్-లింగంపల్లి మధ్య 5 సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.