ఎన్నికల కోడ్: రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్ల సస్పెన్షన్
రాజమహేంద్రవరం (CLiC2NEWS): ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తొలి రోజునుండే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇసి సస్సెన్షన్ విధిస్తుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో 23 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని ఎన్నికల సంగం ఇప్పటికే స్పష్టంమేన ఆదేశాలు జారీ చేసింది.
బుధవారం 45 మంది వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వైఎస్ ఆర్‌సిపి అభ్యర్తి అంబటి మురళి వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 37 మంది పాల్గొన్నట్లు సమాచారం. మరో 8 మంది వాలంటీర్లు.. పెదకాకాని వెనిగండ్ల గ్రామంలో ఆత్మీయ సమావేశమయ్యారు. వీరందరిని విధుల నుండి తొలగిస్తూ మండల అభివృద్ధి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.