24 గంటల్లో కోస్తా, సీమ జిల్లాల్లో వర్షాలు

అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దానికి తోడు దక్షిణ చత్తీస్గఢ్, ఉత్తర మహారాష్ట్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. వీటి మూలంగా తూర్పు బంగాళాఖాతంలో ఈ నెల 9 న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. వీటి ప్రభావంతో నిన్న రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, సీమల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు ఉత్తరాంధ్ర, యానాం, సీమల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.