26న ఢిల్లీలో కిసాన్ గణతంత్ర పరేడ్ నిర్వహిస్తాం..
న్యూఢిల్లీ: కేంద్ర సర్కార్ కొత్తగా తెచ్చిన రైతు చట్టాలను రద్దు చేయకుంటే ఈనెల 26వ తేదీన ఢిల్లీలో కిసాన్ గణతంత్య్ర పరేడ్‌ను నిర్వహిస్తామని రైతు సంఘాలు పేర్కొన్నాయి. 40 రైతు సంఘాలతో ఏర్పడిన యూనియన్ ఈ విషయాన్ని స్ఫష్టం చేసింది. జనవరి 26వ తేదీ వరకు తమ డిమాండ్లు అంగీకరించకపోతే, ఆ రోజున ట్రాక్టర్లతో ఢిల్లీలో పరేడ్ నిర్వహించనున్నట్లు స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఈ ర్యాలీలో పాల్గొనాలని, దేశవ్యాప్తంగా ఉన్న రైతు కుటుంబాలు తమ ఇంటి నుంచి ఓ వ్యక్తిని ఢిల్లీకి పంపాలని యోగేంద్ర కోరారు. ఈనెల 23వ తేదీన ప్రతి రాష్ట్రంలోనూ గవర్నర్ ఇండ్లను ముట్టడి చేయనున్నట్లు క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ తెలిపారు.