ఎపిలో ఇక 26 జిల్లాలు!
బాలాజి, అన్నమయ్య, అల్లూరి, ఎన్టీఆర్, సత్యసాయి కొత్త జిల్లాల పేర్లు.. నేడు వెలువడనున్న నోటిటిఫికేషన్ !
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ ఈరోజు (బుధవారం ) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కొత్త జిల్లాల ఏర్పటుపై మంగళవారం రాత్రి 8 గంటలవరకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయలన్న ప్రతిపాదనకు అనుగుణంగా కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించింది. 26 జిల్లాలులగా పునర్విభజించారు. అరకు లోక్‌సభ స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావున.. రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు.
- జిల్లాపేరు ========== జిల్లాకేంద్రం
- శ్రీకాకుళం ========== శ్రీకాకుళం
- విజయనగరం ========== విజయనగరం
- మన్యం జిల్లా ========== పార్వతీపురం
- అల్లూరిసీతారామరాజు ========== పాడేరు
- అనకాపల్లి ========== అనకాపల్లి
- తూర్పుగోదావరి ========== కాకినాడ
- కోనసీమ ========== అమలాపురం
- రాజహేంద్రవరం ========== రాజమహేంద్రవరం
- నరసాపురం ========== భీమవరం
- పశ్చిమగోదావరి ========== ఏలూరు
- కృష్ణా ========== మచిలీపట్నం
- ఎన్‌టి ఆర్ జిల్లా ========== విజయవాడ
- గుంటూరు ========== గుంటూరు
- బాపట్ల ========== బాపట్ల
- పల్నాడు ========== నరసరావుపేట
- ప్రకాశం ========== ఒంగోలు
- ఎస్‌పిఎస్ నెల్లూరు ========== నెల్లూరు
- కర్నూలు ========== కర్నూలు
- నంద్యాల ========== నంద్యాల
- అనంతపురం ========== అనంతపురం
- శ్రీసత్యసాయిజిల్లా ========== పుట్టపర్తి
- వైఎస్సార్ కడప ========== కడప
- అన్నమయ్య జిల్లా ========== రాయచోటి
- చిత్తూరు ========== చిత్తూరు
- శ్రీభాలాజీ జిల్లా ========== తిరుపతి