3వ‌ అంత‌స్థు నుంచి పిల్ల‌ల్ని జార‌విడిచిన త‌ల్లి… వీడియో వైర‌ల్‌

ఇస్తాంబుల్‌: ట‌ర్కీ రాజ‌ధాని ఇస్తాంబుల్‌లోని అపార్ట్‌మెంట్‌లోని మూడ‌వ అంత‌స్థులో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. భారీగా మంట‌లు వ్యాపించ‌డంతో ఆ ఇంట్లో ఉన్న మ‌హిళ‌ త‌న న‌లుగురు పిల్ల‌ల్ని కిటికీ నుంచి బ‌య‌ట‌కు జార‌విడిచింది. స్థానికంగా ఉన్న కొంద‌రు కింద దుప్ప‌ట్ల‌తో ఆ పిల్ల‌ల్ని జాగ్ర‌త్త‌గా పట్టుకున్నారు. అపార్ట్‌మెంట్‌లో మంట‌లు ఎక్కువ‌గా వ్యాపించ‌డంతో ఆ మ‌హిళ త‌న పిల్ల‌ల‌ను కిటికి నుంచి కింద‌కు జార‌విడిచింది. ఫ్లాట్ ఎంట్రెన్స్ వ‌ద్దే అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు పిల్ల‌లు, త‌ల్లి అంద‌రూ సుర‌క్షితంగా ఉన్నారు. అయితే మంట‌లు చెల‌రేగిన స‌మ‌యంలో తీసిన వీడియో ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మీరూ ఓ లుక్కేయండి..

Leave A Reply

Your email address will not be published.