3 రోజుల్లో 1.4లక్షల మందికి టీకాలు: సిఎస్

హైదరాబాద్ (CLiC2NEWS): స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.4 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హైరిస్క్ గ్రూప్‌లకు ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 32 సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం పబ్లిక్‌గార్డెన్‌కు ఎదురుగా ఉన్న రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ సెంటర్లలో ఉదయం 8 నుంచి టీకాలు వేస్తారని, అధికారులు గుర్తించి కూపన్లు జారీ చేసిన వీధి వ్యాపారులు, కిరాణాషాపులు, ఫెస్టిసైడ్ షాపుల్లో పని చేస్తున్న కార్మికులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఆయన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్‌ను సందర్శించారు.