అయోధ్య గుడికి 3 రోజుల్లోనే రూ.100 కోట్ల విరాళాలు..
అయోధ్య: రామ మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల కార్యక్రమం.. ఫిబ్రవరి 27 వరకూ కొనసాగనుంది. మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ఈ విరాళాల కార్యక్రమం ప్రారంభించింది. అయితే ఇప్పటికే రూ.100 కోట్ల విరాళాలు వచ్చినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ఈ విరాళాల మొత్తం సమాచారం ఇప్పటి వరకూ తమకు చేరకపోయినా.. రూ.100 కోట్ల వరకూ విరాళాలు వచ్చినట్లు తమ కార్యకర్తలు చెప్పారని ఆయన తెలిపారు. మందిరం కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా రూ.5 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే.