3-1తో సిరీస్ కైవ‌సం

నాలుగో టెస్ట్‌లో ఇండియా విక్ట‌రీ

అహ్మ‌దాబాద్ : మొతెరాలో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ కొట్టింది. అక్ష‌ర్ ప‌టేల్ (5/48), అశ్విన్ (5/47) ఐదు వికెట్లతో వ‌ణికించిన వేళ నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 25 ప‌రుగుల తేడాతో విజ‌య ఢంకా మోగించింది. కోహ్లీ సేన 365 ప‌రుగుల‌కు ఆల‌వుట‌వ్వ‌డంతో రెండో రోజు ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన జోరూట్ సేన 135 ప‌రుగుల‌కే ఆల‌వుట‌యింది.

అంత‌క‌ముందు ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 365 ర‌న్స్ చేసింది. ఇండియ‌న్ ఇన్నింగ్స్‌లో రిష‌బ్ పంత్ సెంచ‌రీ చేయ‌గా.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ 96 చేసి నాటౌట్‌గా నిలిచాడు.
వ‌రుస‌గా వికెట్లు..
అయితే ఇవాళ తొలి సెష‌న్‌లోనే రెండ‌వ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్‌కు ఎక్క‌డా అచ్చిరాలేదు. సెకండ్ సెష‌న్ ఆరంభంలోనే భార‌త స్పిన్న‌ర్లు దూకుడు ప్ర‌ద‌ర్శించారు. ఇంగ్లండ్‌ టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ ఎటువంటి మెరుపులు మెరిపించ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరుకున్నారు. కెప్టెన్ జో రూట్ కాసేపు భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొన్నాడు. జో రూట్ 30 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో డాన్ లారెన్స్ కాస్త ప్ర‌తిఘ‌టించాడు. గౌర‌వ ప్ర‌ద‌మైన ఓట‌మిని అందించాల‌ని త‌ప‌న ప‌డ్డాడు. కానీ లారెన్స్ హాఫ్ సెంచ‌రీ చేసి చివ‌ర‌కు అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అశ్విన్‌, అక్ష‌ర్‌లు వ‌రుస‌గా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియ‌న్‌కు పంపించారు. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా పిచ్‌లో నిల‌దొక్కుకునేలా చేయలేదు. అక్ష‌ర్ ప‌టేల్ మ‌ళ్లీ ఇర‌గ‌దీశాడు. వ‌రుస‌గా మూడోసారి అయిదు వికెట్లు తీసుకున్నాడు. మూడ‌వ టెస్టు ఆడుతున్న అక్ష‌ర్ ప‌టేల్‌.. మొత్తం నాలుగోసారి త‌న ఖాతాలో 5 వికెట్లు వేసుకున్నాడు.

స్కోరు బోర్డు..

  • ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 205
  • భార‌త్ తొలి ఇన్నింగ్స్‌: 365
  • ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్:135
Leave A Reply

Your email address will not be published.