తెలంగాణలో 3 రోజులు వానలు: ఐఎండి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ గాలుల ప్రభావంతో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ (బుధవారం), రేపు (గురువారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని తెలిపింది.