30 రోజుల్లో 79 వేల మంది చిన్నారులకు కొవిడ్
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గతేడాది ఇదే సమయంలో ఈ మహమ్మారి పెద్దలపై విరుచుకుపడగా, సెకండ్ వేవ్‌లో మాత్రం చిన్నారులపై కోరలు చాచి బుసలు కొడుతోంది. కేవలం 30 రోజులలోనే దేశ వ్యాప్తంగా 79,688 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
- మహారాష్ట్ర: మార్చి 1 నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్యలో ఒక్క మహారాష్ర్టలోనే 60,684 మంది చిన్నారులకు కరోనా సోకింది. ఇందులో ఐదేళ్ల లోపు చిన్నారులు 9,882 మంది ఉన్నట్లు పేర్కొంది.
- ఛత్తీస్‌గఢ్: 5,940 మంది పిల్లలకు ఛత్తీస్‌గఢ్‌లో కరోనా వ్యాప్తి చెందగా, 922 మంది చిన్నారులు ఐదేళ్ల లోపు వారు ఉన్నారు.
- కర్ణాటక: కర్ణాటకలో 7,327(ఐదేళ్ల లోపు చిన్నారులు 871).
- ఉత్తరప్రదేశ్: 3,004(ఐదేళ్ల లోపు చిన్నారులు 471) మంది పిల్లలకు ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
- ఢిల్లీ: 2,733 మంది పిల్లలు దేశరాజధానిలో కరోనా బారిన పడగా, ఐదేళ్ల లోపు చిన్నారులు 441 మంది ఉన్నారు.