ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో 30 మేనేజ‌ర్ పోస్టులు

IREL: ముంబ‌యిలోని ఇండియ‌న్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) లో 30 మేనేజ‌ర్‌ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఫైనాన్స్‌, హెచ్ ఆర్ ఎం, రాజ్‌భాష‌, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ & మార్కెటింగ్ , సివిల్ , టెక్నిక‌ల్ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల ఎంపిక రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా జ‌రుగుతంది.

ఎంపికైన వారికి నెల‌కు జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుకు రూ. ల‌క్ష నుండి రూ.2,60ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. డిప్యూటి మేనేజ‌ర్‌కు నెల‌కు వేత‌నం రూ. 90వేల నుండి రూ.2,40,000 వ‌ర‌కు ఉంది. చీఫ్ మేనేజర్ కు అందే జీతం నెల‌కు రూ. 80వేల నుండి రూ. 2,20,000 వ‌ర‌కు ఉంది. సీనియ‌ర్ మేనేజ‌ర్ కు రూ. 70వేల నుండి రూ.2లక్ష‌ల వ‌ర‌కు నెల‌కు అందుతుంది. అసిస్టెంట్ మేనేజ‌ర్‌కు రూ. 40 వేల నుండి 1,40,000 వ‌ర‌కు నెల‌కు వేత‌నం అందుతుంది.

అర్హ‌త అభ్య‌ర్థులు సిఎ, సిఎంఎ, ఎంబిఎ, బికాం, ఎంఎ, ఎంఎన్‌డ‌బ్ల్యు, మాస్ట‌ర్స్‌డిగ్రి, బిఇ, బిటెక్, బిఎస్‌సి, ఎంఎస్‌సి ఉత్తీర్ణ‌త‌తో పాలు ఉద్యోగానుభ‌వం ఉండాలి.

జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అభ్య‌ర్థుల‌కు 50 ఏళ్లు, డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు 46 ఏళ్లు.. చీఫ్ మేనేజ‌ర్‌కు 42 ఏళ్లు.. సీనియ‌ర్ మేనేజ‌ర్‌కు 38 ఏళ్లు.. అసిస్టెంట్ మేనేజ‌ర్‌కు 28 ఏళ్లు ఉండాలి. ఒబిసిల‌కు మూడేళ్లు.. ఎస్‌సి , ఎస్ టి అభ్య‌ర్తుల‌కు ఐదేళ్లు ,దివ్యాంగుల‌కు ప‌దేళ్ల స‌డ‌లింపు ఉంటుంది.

జ‌న‌ర‌ల్, ఒబిసి , ఇడ‌బ్ల్యుఎస్ అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.500 గా నిర్ణ‌యించారు. మిగిలిన వారికి మిన‌హాయింపు ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.