ఇండియన్ నేవీలో అగ్నివీర్ మెడికల్ పోస్టులు
AGNIVEER: భారత నౌకాదళంలో అగ్నివీర్ పోస్టులకు ప్రకటన వెలువడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా.. అగ్నివీర్ ఎస్ ఎస్ ఆర్ (మెడికల్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 29 నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు పురుషులు, మహిళలు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఒడిశా రాష్ట్రంలో ని ఐఎన్ ఎస్ చిల్కాలో 01/2025 బ్యాచ్‌కు సెప్టెంబర్‌లో .. 02/2026 బ్యాచ్‌కు జులైలో కోర్సు శిక్షణ ప్రారంభిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయా విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు వేతనం అందుతుంది.
కనీసం 50% మార్కులతో ఫిజిక్స్ , కెమిస్ట్రి, బయాలజి ప్రధాన సబ్టెక్టులుగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 100 బహుళైచ్చిక ప్రశ్నాపత్రం ఉంటుంది. ఈ ప్రశ్నలు హిందీ/ ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. అభ్యర్థలు తెలియని వాటిని వదిలేయడం మంచింది.
వయస్సు ఎస్ ఎస్ ఆర్ (మెడికల్) 02/2025 బ్యాచ్‌కు 01.09.2004 నుండి 29.02.2008లోపు జన్మించాలి. 02/2026 బ్యాచ్‌కు 01.07.2005 నుండి 30.12.2010 లోపు జన్మించి ఉండాలి. పురుషులు , మహిళలు కనీసం 157 సెం.మీ ఎత్తు ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు ఉండాలి.
దరఖాస్తులను ఏప్రిల్ 10వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. దరఖాస్తులను నేవీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.550 గా నిర్ణయించారు.