ఖమ్మం జిల్లాలో 300 అడుగుల జాతీయ జెండా..
ఖమ్మం (CLiC2NEWS): పదికాదు, ఇరవైకాదు.. ఏకంగా 300 అడుగుల జాతీయ జెండా. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్లలో 300 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. బాలికా దినోత్సవం, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తనికెళ్లలోని పాఠశాల విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భారీ మువ్న్నెల జెండా పట్టుకొని విద్యార్థులంతా నినాదాలు చేస్తూ కలిసి సాగారు.. పలువురు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో మువ్వన్నెల జెండా ప్రదర్శనతో పాటు చూపరులను ఆకట్టుకున్నారు.