31 వరకు ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు

హైదరాబాద్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల గడువును తెలంగాణ సర్కార్ ఈ నెల (అక్టోబరు) 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈమేరకు కెసిఆర్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. ముందుగా ఎల్ఆర్ఎస్కు గడువు ఈ నెల 15 వరకే. కానీ భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో భూ యజమానులు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోలేక పోయారు. మరికొంత గడువు కావాలని వివిధ ప్రాంతాలనుంచి విజ్ఞప్తులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిని, వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన సీఎం కేసీఆర్ గడువును మరో 15 రోజులపాటు పొడిగించాలని నిర్ణయించారు. ఈ మేరకు గడువును పొడిగించినట్టు సీఎస్ తెలిపారు. గురువారంనాటికి మొత్తం 18,99,876 దరఖాస్తులు రాగా, ఒక్కరోజే 2.71 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.