32 మంది మావోయిస్టులు లొంగుబాటు

రాయ్‌పూర్: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రంలో 32 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాకు చెందిన‌ ఈ 32 మందిలో న‌లుగురిపై రూ. ల‌క్ష చొప్పున‌ రివార్డు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 10 మంది మ‌హిళ‌లు ఉన్నారు. వీరంద‌రికి జీవ‌నోపాధి క‌ల్పిస్తామ‌ని పోలీసులు పేర్కొన్నారు. ప్ర‌స్తుతం లొంగిపోయిన మావోయిస్టుల‌కు త‌క్ష‌ణ సాయం కింద రూ. 10 వేలు ఆర్థిక సాయం అంద‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 150 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు జ‌న‌జీవ‌న స్ర‌వంతిలోకి వ‌చ్చేందుకు పోలీసులు కృషి చేస్తున్నార‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.