ఆదిలాబాద్‌ జిల్లాలోని గురుకుల పాఠ‌శాల‌లో 32 మంది విద్యార్థినుల‌కు అస్వ‌స్థ‌త‌

నేర‌డిగొండ(CLiC2NEWS): ఆదిలాబాద్ జిల్లా నేర‌డిగొండ మండ‌లంలోని క‌స్తూర్బా గాంధీ గురుకుల పాఠ‌శాల‌లో 32 మంది విద్యార్థినులు క‌లుషిత ఆహారం తిని అస్వ‌స్థ‌త‌కు గురైనారు. వారిని జిల్లాలోని రిమ్స్‌కు త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ఆదివారం మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌ర్వాత 11 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వారికి చికిత్స‌నందించారు. వారి ఆరోగ్య ప‌రిస్థితి మెరుగుప‌డ‌టంతో పాఠ‌శాల‌కు పంపించారు. అనంత‌రం రాత్రి భోజ‌నం తర్వాత మ‌రో 25 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని కూడా నేరడిగొండ పిహెచ్‌సికి త‌ర‌లించి చికిత్స అందించారు. వీరిని ఆదిలాబాద్‌ రిమ్స్ కి పంపించాల్సిందిగా వైద్యులు సూచించ‌డంతో ఆంబులెన్స్‌ల‌లో రిమ్స్‌కు త‌రలించారు.

సోమ‌వారం మ‌రో ఏడుగురు అస్వ‌స్థ‌త‌కు గురికాగ.. వారిని కూడా రిమ్స్‌కు పంపించారు. అయితే.. నాణ్య‌తలేని ఆహారం పెడుతున్నార‌ని విద్యార్థులు ఆదివారం ఆందోళ‌న‌కు దిగారు. ర‌హ‌దారిపై ఆందోళ‌న చేస్తున్నార‌ని సిబ్బంది గేటు వేశారు. తర్వాత విద్య‌ర్థులు పాఠ‌శాల భ‌వ‌నం ఎక్కి మరీ ఆందోళ‌న చేప‌ట్టారు. పాఠ‌శాల ప్ర‌త్యేక అధికారి విద్యార్థినుల‌తో మాట్లాడి.. నాణ్య‌మైన భోజ‌నం అందిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో విద్యార్థులు త‌మ ఆందోళ‌న విర‌మించిన త‌ర్వాత ఇలా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. స‌మాచారం అందుకున్న డిఇఒ ప్ర‌ణీత పాఠ‌శాల‌ను సంర‌ర్శించి భోజ‌నం త‌యారు చేసే సిబ్బందిని తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎస్ఒపై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.

3 Comments
  1. goaldaddy mobile says

    Hi every one, here every one is sharing these kinds of knowledge, therefore it’s
    pleasant to read this web site, and I used to go to see
    this weblog everyday.

  2. thaitaan.com says

    I am sure this article has touched all the internet people, its
    really really good piece of writing on building up new weblog.

  3. crea un account binance says

    Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.

Leave A Reply

Your email address will not be published.