విమానాశ్రయంలో పట్టుబడ్డ 32 కిలోల బంగారం..

ముంబయి (CLiC2NEWS): ముంబయి విమానాశ్రయంలో అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. ఇద్దరు విదేశీ మహిళల అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేశారు. వారి వద్ద 32.79 కిలోల బరువున్న 72 బంగారు బిస్కెట్లు అధికారులు గుర్తించారు. మహిళలు బ్యాగులు, లోదుస్తులలో దాచి తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయింది. విమానాశ్రయాలలో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న వారిని కస్టమ్స్ అధికారులు పట్టుకుంటున్నారు. తాజాగా ముంబయి విమానాశ్రయంలో 72 బంగారం బిస్కెట్లతో ఇద్దరు మహిళలు పట్టుబడ్డారు