పల్నాడు: గురుకుల పాఠశాల హాస్టల్ నుండి 35 మంది విద్యార్థులు పరారీ

యడ్లపాడు (CLiC2NEWS): పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం వంకాయలపాడులో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులు 35 మంది పరారయ్యారు. సోమవారం ఉదయం ప్రార్థన ముగియగానే ప్రహరీగోడ దూకి మొత్తం 67 మంది విద్యార్థులు బయటకు వెళ్లారు. అదిగమనించిన ఉపాధ్యాయులు కొంతమందిని అక్కడే పట్టుకున్నారు. మరికొంత మంది సమీపంలోని కొండవీటి కొండలపైకి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు వెంటనే విద్యార్థులను పట్టుకుని పాఠశాలకు తీసుకెళ్లారు. టీచర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు పోలీసులకు చెప్పటం జరిగింది. నాణ్యమైన ఆహారం, సరిపడా మంచి నీరు అందించడంలేదని ఆరోపించారు. నిజానిజాలను విచారించి విద్యార్తులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.