3,524 కరోనా కేసులు.. 59 మరణాలు

ముంబ‌యి: దేశ ఆర్థిక రాజ‌ధాని మహారాష్ట్రలో కరోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొంత తగ్గినప్పటికి ప్రతి రోజు వేలల్లో పాజిటివ్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 3,524 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,35,636కు, మరణాల సంఖ్య 49,580కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 4,279 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,32,825కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,084 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.