Hyderabad: 36 ఎంఎంటిఎస్ సర్వీసులు రద్దు

హైదరాబాద్ (CLiC2NEWS): సికింద్రాబాద్ పరిధిలోని 36 ఎంఎంటిఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రతీరోజూ నడిపే 79 ఎంఎంటిఎస్ సర్వీసులలో 39 సర్వీసులను రద్ధు చేశారు. ట్రాక్ మరమ్మత్తులు, సాంకేతిక కారణాల వలన ఈ సర్వీసులను రద్ధు చేస్తున్నట్లు పేర్కొంది.
రద్దయిన సర్వీసులు
లింగంపల్లి -హైదరాబాద్ (9 సర్వీసులు)
హైదరాబాద్ – లింగంపల్లి (9 సర్వీసులు)
ఫలక్నుమా – లింగంపల్లి (8 సర్వీసులు)
లింగంపల్లి – ఫలక్నుమా (8 సర్వీసులు)
సికిందరాబాద్ – లింగంపల్లి (1 సర్వీసు)
లింగంపల్లి – సికిందరాబాద్ ( 1 సర్వీసు)