4న యాదాద్రికి ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: మార్చి 4న సిఎం కెసిఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారని సమాచారం. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ తుదిమెరుగుల పనులను వీక్షించనున్నారు.