పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభవించి 40 మంది మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/BOMB-BLAST-IN-PAKISTAN.jpg)
ఇస్లామాబాద్ (CLiC2NEWS): ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఓ రాజకీయ పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మందికిపైగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతి చెందినట్లు సమాచారం. జెయుఐఎఫ్ రాజకీయ పార్టీ మీటింగ్‌ను నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కీలక నేత మృతి చెందినట్లు స్థానిక వార్తా సంస్థలు వెల్లడించాయి. క్షతగాత్రులను పెషావర్‌లోని ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.