42.33 లక్షల మంది ఖాతాల్లో రైతుబంధు జమ

హైదరాబాద్ : యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున నగదు జమచేసింది. మూడురోజులుగా రైతుల ఖాతాల్లో నగదు జమ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 42.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమైంది. 59.11 లక్షల ఎకరాలకు రూ. 2955.70 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. గురువారం 6.41 లక్షల మంది రైతులకు చెందిన 22.48 లక్షల ఎకరాలకు రూ.1123.78 కోట్లు జమ చేయనుంది.