మే 7న వేలానికి 446 స్క్రాప్ వాహనాలు సిద్ధం
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి : అడిషనల్ డీసీపీ అడ్మిన్
రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన, గుర్తు తెలియని వాహనాలకు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈనెల 7న 446 స్క్రాప్ వాహనాల బహిరంగ వేలం నిర్వహిస్తామని దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.
కమిషనరేట్ పరిధిలో 368 ద్విచక్ర వాహనాలు, 67 మూడు చక్రాల వాహనాలు, 11 నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆరు నెలలుగా వాహనాల కోసం ఎవరూ రానందున గుర్తుతెలియని ప్రాపర్టీగా గుర్తించి ఉన్న తాధికారుల ఆదేశం మేరకు వేలం వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 7న ఉదయం 11:30 గం టలకు బెల్లంపల్లి సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ రావాలని సూచించారు. ఆసక్తి గలవారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొం దిన గుర్తింపుకార్డు ఆధార్ కార్డ్, మరేదైనా గుర్తింపు కార్డు, ఇతర వివరాలతో రావాలని తెలిపారు. పూర్తి వివరాలకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ మధూకర్ 7901126902, అంజన్న 9494026036 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.