Mancherial: ఇటుక ట్రాక్టర్లో అక్రమంగా గంజాయి తరలింపు

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లాలోని శ్రీరాంపూర్ జాతీయ రహదారిపై ఇటుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా..సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. ట్రాక్టర్ని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఛత్తీస్ గఢ్ నుండి గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం.