AP: అమర వీరుని కుటుంబానికి రూ.50లక్షల ఆర్ధిక సాయం

అమరావతి (CLiC2NEWS): జమ్ముకాశ్మీర్ ఉగ్రవాద కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన గుంటూరు జిల్లా జవాన్ జస్వంత్ రెడ్డి కుటుంబానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణలో తన ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన జస్వంత్ రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. అతని సేవలు వెలకట్టలేనివని అన్నారు.