Ramagundam: 51మంది కానిస్టేబుళ్ల‌కు పదోన్నతి..

రామగుండం (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో 51మంది కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుళ్ల‌గా పదోన్నతి పొందారు. ఈ సంద‌ర్బంగా రామ‌గుండం పోలీస్ క‌మిష‌న‌ర్ అంబర్ కిశోరే వారిని అభినందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు, ఉత్సాహం వ‌స్తుంద‌ని ఎలాంటి రిమార్క్ లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పనితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సిపి అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఎఓ శ్రీనివాస్ , ఆర్ ఐ శ్రీనివాస్, సూపరిండెంట్ లు సందీప్ ,మనోజ్ కుమార్ ,సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.