పాఠశాలలో కలుషిత ఆహారం.. హెడ్మాస్టర్ సస్పెన్షన్ ..
ముదిగొండ (CLiC2NEWS): గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం ఘటన.. పాఠశాల హెడ్మాస్టర్ను సస్పెండ్ చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని దేవరకొండ మండలం ముదిగొండ లోని ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న 52 మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వంట సిబ్బందికి నాణ్యమైన భోజనం తయారీ పట్ల సరైన సూచనలు ఇవ్వలేదని .. ఇది హెడ్మాస్టర్ నిర్లక్ష్యం వహించడం కారణమని, దీంతో విద్యార్థినులు అస్వస్తతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.