కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు.. 8 కారులు దగ్ధం

జహీరాబాద్ (CLiC2NEWS): కార్లు తరలిస్తున్న కంటైనర్‌లో మంటలు అలుముకొని అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబయి నుండి నగరానికి వస్తున్న కంటైనర్ లో మంటలు వ్యాపించాయి. దీంతో కంటైనర్‌లో ఉన్న 8 కార్లు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. జహీరాబాద్ అగ్నిమాపక సిబ్బంది సహా మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగార ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.