6 లక్షల దిగువకు యాక్టివ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసులు సంఖ్య 6 లక్షల దిగువకు చేరాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 5,94,386 ఉన్నాయ‌ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 48,648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కి చేరింది. కొత్తగా నమోదు అయిన కేసుల్లో 78 శాతం కేవలం పది రాష్టాల్లోనే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 563 మంది మరణించగా, ఇప్పటి వరకు మొత్తం 1,21,090 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఒక్క రోజులోనే 57,386 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటి వరకు మొత్తం 73,73,375 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 91.15 శాతం నమోదు అయింది. మరణాల రేటు 1.50 శాతంగా ఉంది. తాజాగా కోలుకున్న వారిలో 80 శాతం మంది కేవలం పది రాష్టాల్లోనే ఉన్నారు. అలాగే దేశంలో కరోనాతో మృతిచెందిన వారిలో 81 శాతం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే సంభవించాయి.

Leave A Reply

Your email address will not be published.