AP: కొత్త జాబ్ క్యాలెండర్‌లో సుమారు 6 వేల ఉద్యోగాలు?
అమరావతి (CLiC2NEWS) : ఎపి ప్రభుత్వం కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పిహెచ్‌సి) కు అనుమతిచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 1,149 పిహెచ్‌సిలు ఉన్నాయి. కొత్తగా వచ్చే పిహెచ్‌సిలకు డాక్టర్లు, పారామెడికల్,అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది నియామకాన్ని త్వరలో చేపడతామని అధికారులు తెలియజేశారు. ప్రభుత్వం 27 నెలల్లో వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 14 వేల పోస్టులను భర్తీ చేసిందని, రాష్ట్ర చరిత్రలో ఇది అతిపెద్ద నియామక ప్రక్రియ అని అధికారులు వెల్లడించారు.
కొత్తగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం 2021 నవంబర్‌లో నియామకాలు ఇలా..
డాక్టర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పారామెడికల్ సిబ్బంది, ఫార్మసిస్ట్ -451
ల్యాబ్ టెక్నీషియన్స్ – 5,251
నర్సులు – 441