60 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

సిర్పూర్(టి) (CLiC2NEWS) : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలంలో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని వెంకట్రావు పెట్ గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా నింధితుల నుండి భారీగా నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ జరిపిన తనిఖీల్లో మహారాష్ట్ర కు చెందిన దీపక్, వెంకట్రావు పెట్ గ్రామానికి చెందిన టుస్సే భాస్కర్ దాదాపు 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణ కు సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు విలువ రూ. 1,10.000 వరకు ఉండొచ్చని తెలిసింది. నిందితులు ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.