7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో సీఎం స‌మావేశం

హైద‌రాబాద్‌: ఈ నెల 7న పోలీసు ఉన్న‌తాధికారుల‌తో సిఎం కెసిఆర్ విస్తృత‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈమేర‌కు రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల నిర్వ‌హణ‌తోపాటు ఇత‌ర అంశాల‌పై బుధ‌వారం ఉద‌యం 11.30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మావేశ‌మ‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌, అడ‌వుల సంర‌క్ష‌ణ‌, గంజాయి, మాద‌కద్రవ్యాల నియంత్ర‌ణ‌, క‌ల‌ప స్మ‌గ్లింగ్ అరిక‌ట్ట‌డం వంటి ప‌లు అంశాల‌పై స‌మీక్ష చేయ‌నున్నారు. ఈస‌మావేశానికి హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, అట‌వీశాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి త‌దిత‌రులు హాజరు కానున్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.