టీఆర్ఎస్, ఎంఐఎం సయామీ ట్విన్స్: విజయశాంతి

హైదరాబాద్: బీహార్‌లో టీఆరెస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. తద్వారా చాలా రాష్ట్రాల్లో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారన్నారు. అందుకు అవసరమైన పెద్ద ఎత్తున నిధులను కూడా టీఆరెస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయని విజయశాంతి తెలిపారు. అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆరెస్ – ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు.
ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆరెస్ అధినేత ఎంఐఎంతో కలిసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారని చెప్పారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవేనన్నారు. ఇక ఈ రోజు టీఆరెస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆరెస్ – ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్రని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదని పడదని చెప్పారు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయన్నారు. అవసరం లేకున్నా కలిసే ఉంటాయని చెప్పారు. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్ అని విజయశాంతి తెలిపారు.
బీహార్‌లో టీఆరెస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు…
Posted by Vijayashanthi on Sunday, 22 November 2020