8 వాహనాలు ఢీ: ముగ్గురు మృతి
లక్నో: దట్టమైన పొగ మంచు వల్ల ఎనిమిది వాహనాలు ఢీకొన్న ప్రమాదాల్లో ముగ్గురు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వేపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు జరిగాయి. దట్టమైన పొగ మంచు వల్ల ముందు ఉన్నవి, ఎదురుగా వచ్చేవి సరిగా కనిపించకపోవడంతో ఎనిమిది వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదాలు జరిగిన ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోయారు. గాయపడిన వారిని సైఫాయిలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.