8 మంది సర్పంచులకు షోకాజు నోటిసులిచ్చిన జగిత్యాల కలెక్టర్
జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధితో పాటు, రైతుల అభివృద్ధికై ప్రవేశ పెట్టిన రైతువేధికల నిర్మాణా పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్పంచులకు షోకాజు నోటిసులను జారి చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో MGNREGS & Agriculture Dept. సమన్వయంతో గ్రామాలలో రైతువేదికలు నిర్మించుటకు మార్గదర్శకాలను జారి చేయడం జరిగిందని. అందులో భాగంగా జిల్లాలో వివిధ అభివృద్ధి పనులను పరిశీలించిన సమయంలో నిర్మాణా పనులలో నిర్లక్ష్యం వహించరాదనీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతువేదిక నిర్మాణాలు వేగవంతంగా పూర్తిచేయాలనీ ఆదేశించినప్పటికి, నిర్లక్ష్యం వ్యవహిరించిన ధర్మపురి మండలం రాజారం, జైనా సర్పంచులు శ్రీమతి రంగు మమత, జే. ప్రభాకర్ రావు, రాయికల్ మండలం ధర్మాజీపేట సర్పంచ్ శ్రీమతి యం. స్నేహ, వెల్గటూర్ మండలం గుల్లకోట, చేగ్యం మరియు వెల్గటూర్ సర్పంచులు శ్రీమతి పి. లావణ్య, శ్రీమతి ఆర్. లావణ్య మరియు మెరుగు మురళి, కథలాపూర్ మండలం బొమ్మెన సర్పంచ్ పి. లావణ్య, కోరుట్ల మండలం పైడిమడుగు సర్పంచ్ డి. భీమారెడ్డి లకు షోకాజు నోటిసులు జారి చేయనైనదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టె ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను తమ బాధ్యతగా నిర్వహించ వలనిస బాధ్యత మన అందరిదని, ఎవరు కుడా తేలికగా తీసుకోకూడదని ఈ సందర్బంగా ఆదేశించారు.