శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాలనుండి శబరిమల వెళ్లే భక్తుల కోసం ఎనిమిది ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 18 వ తేదీ నుండి వచ్చేనెల 1వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
రైళ్ల వివరాలు
నవంబర్ 18,25 తేదీల్లో మచిలీపట్నం- కొల్లాం,
నవంబర్ 20,27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం,
నవంబర్ 22,29 తేదీల్లో మౌలాలి-కొల్లాం,
నవంబర్ 24,డిసెంబర్ 1న కొల్లాం-మౌలాలి.