80 వేలకు పైగా కేసులు: ప్రపంచంలోనే ఇదే ప్రథమం!

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూనే ఉంది. రోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 83,883 కేసులు నమోదు కాగా, 1,043 మంది కరోనాతో పోరాడుతూ మృతిచెందారు. ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇంత పెద్ద సంఖ్యలో ఉండడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏ దేశంలోనూ ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కాలేదు. గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 38 లక్షల 53 వేలకు చేరింది. ఇప్పటికే కరోనా నుంచి కోలుకొని 29,70,492 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 8,15,538 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. నిన్న మరో 68 వేల మంది డిశ్చార్చ్ అయ్యారు. గురువారం నాటికి మరణాల సంఖ్య 67,376కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మరణాల సంఖ్య కూడా భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో భారత్‌లో 1,043 మంది కరోనా వల్ల మరణించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాతో 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ 29,70,493 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Super