బెంగళూరు రేవ్ పార్టి.. సిని నటి సహా 86 మందికి డ్రగ్ పాజిటివ్

బెంగళూరు (CLiC2NEWS): బెంగళూరు రేవ్ పార్టిలో మాదక ద్రవ్యాల వినియోగించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ నిర్వహించిన బర్త్‌డే పార్టిలో సుమారు 100 మందికి పైగా హాజరయ్యారు. పార్టి జరిగిన ఫామ్‌హౌస్ నుండి 15.45 గ్రాముల ఎండిఎంఎ బిళ్లలు, 6.2 గ్రాముల కొకైన్ , 6 గ్రాముల హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారికి డ్రగ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. తెలుగు సిని నటి , మరో యువ నటి సహా 86 మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషులలో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరందరికీ విచారణకు హాజరు కావాలని తాకీదులుపంపిస్తామని అధికారులు తెలిపారు.