కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద ఘోర ప్రమాదం

జగ్గయ్యపేట: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ప్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ముందువెళ్లుతున్న లారీని వెనక నుంచి ఢీకొట్టగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. గాయపడినవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఖమ్మం జిల్లా ఆత్కూరు వాసులుగా గుర్తించారు. వీరు కారులో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.