9 నుంచి అగ్రి కోర్సుల్లో ప్రవేశాలు
హైదరాబాద్: వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన కోర్సుల్లో ప్రవేశాలను ఈ నెల 9 నుంచి 12 వరకు రెండోవిడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్ల జయశంకర్ వర్సిటీ అధికారులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు అర్హులైన విద్యార్థుల వివరాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.pjtsau.edu.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. మొదటి విడుత కౌన్సెలింగ్‌కు హాజరు కానివారు కూడా రెండో విడుతలో పాల్గొనవచ్చని అధికారులు వెల్లడించారు.