93.65 శాతానికి చేరిన రిక‌వ‌రీ రేటు

93లక్షలు దాటిన కొవిడ్‌ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులుగా 40 వేల‌కు పైనే కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివ‌రాల ప్ర‌కారం. గురువారం 43,082 కొవిడ్‌ కేసులు వెలుగు చూడ‌గా.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 93,09,788కి చేరాయి. కొత్తగా మరో 492 మంది మహమ్మారికి బలవగా.. మరణాల సంఖ్య 1,35,715కి చేరింది. క్రియాశీల కేసులు 4,55,555 ఉన్నాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 39,379 కొత్త డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 87,18,517 మంది కోలుకున్నారు. రివ‌క‌రీ రేటు 93.65శాతంగా ఉంది. ఇదిలా ఉండగా..గురువారం ఒకే రోజు 11,31,204 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 13,70,62,749 టెస్టులు చేసినట్లు వివరించింది.

Leave A Reply

Your email address will not be published.