మార్చిలోపు కెటిఆర్ సిఎం కావ‌చ్చు..

ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్‌..

డోర్న‌క‌ల్: 2021 మార్చిలోపు మంత్రి కెటిఆర్ ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఉంద‌ని మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయ‌క్ పేర్కొన్నారు. డోర్న‌క‌ల్ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధుల‌తో మంజూరైన రెండు ట్రాక్ట‌ర్ల‌ను బుధ‌వారం ప్రారంభించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు..


ఈ మ‌ధ్య తాను మంత్రి కెటిఆర్‌ని క‌లిసి కుర‌వి మండ‌లం సీరోలు గ్రామ‌న్ని మండ‌ల కేంద్రం చేయాల‌ని, న‌ర్సింహుల పేట‌లో పిహెచ్‌సి నెల‌కొల్పాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. అలాగే డోర్న‌క‌ల్కు ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీకి మంజూరు చేయాలంటూ విన్న‌వించిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా కాబోయే సిఎం కెటిఆర్ అంటూ రెడ్యానాయ‌క్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.