నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ చేయడమే నా లక్ష్యం: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నకిరేకల్: పట్టణం 18 వ వార్డు ఎస్ ఎల్ బి సి కాలనీ లో ఎస్ డి ఎఫ్ నిధుల నుండి 1౦ లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులకు మరియు 1౦ లక్షలతో నిర్మించనున్న సులబ్ కాంప్లెక్స్ నిర్మాణానికి గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నకిరేకల్ పట్టణంలో ఎస్ ఎల్ బి సి కాలనీ లో ప్రధానంగా రోడ్లు గతంలో వర్షం వచ్చినప్పుడు డ్రైనేజీ వాటర్ వర్షం నీరు స్తంభించిపోయి నీరు నిల్వ ఉండి కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారని, రాకపోకలకు ఇబ్బంది పడడం చూసి ఈ ప్రాంత సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్ పట్టణానికి శాలిగౌరారం, తిప్పర్తి, కట్టంగూర్, కేతపల్లి, మండలాల ప్రజలు వ్యాపారరీత్యా, హాస్పిటల్, కాలేజీ, స్కూల్ పిల్లలు నియోజకవర్గ కేంద్రానికి రావడం జరుగుతుందని, ప్రధానంగా మహిళలు టాయిలెట్ కి వెళ్లడానికి ఇబ్బంది పడడంతో మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రతి టౌన్ లో సులబ్ కాంప్లెక్స్ ఉండాలన్న వారి ఆదేశంతో దానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. మంత్రి కెటిఆర్ , జగదీష్ రెడ్డి సహకారంతో నిధులు సమికరించి పట్టణంలో సిసి రోడ్లు, డ్రైనేజీ వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.